
(బాలె అజయ్, 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం వైభవంగా శ్రీ వీరహనుమాన్ విజయయాత్ర కార్యక్రమం సాగింది. కోరుట్ల పట్టణ విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలోని శ్రీవేంకటేశ్వర దేవాలయం నుండి సాగిన ఈ విజయయాత్ర ఐలాపూర్ దర్వాజా, కార్గిల్‌చౌక్, కొత్త బస్టాండ్, అంబెద్కర్ చౌరస్తా, కాల్వగడ్డ మీదుగా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ముగిసింది.
ఈ కార్యక్రమంలో కోరుట్ల మెట్‌పల్లి సబ్‌డివిజన్ పరిధిలోని విశ్వహిందుపరిషత్, భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు, నాయకులు, హనుమాన్‌దీక్షాపరులు, పట్టణ యువకులు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు పెద్దఎత్తున పాలొ ్గన్నారు స్థానిక సర్కిల్ సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

