(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
పట్టణంలోని 25వ వార్డు మార్కండేయ ఆలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఎన్యూమరేషన్ హెల్ప్ డెస్క్‌ను వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వార్డు కౌన్సిలర్ కలాల రాధ సాయిచంద్ కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ వరకు హెల్ప్ డెస్క్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వార్డు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కౌన్సిలర్ రాధ సాయిచంద్ పిలుపునిచ్చారు.
