28.3 C
Hyderabad
Saturday, August 1, 2026
No menu items!

హంతకుని గూర్చి కొంత వివరణ

నాథూరామ్‌ నడవడి, నేర్పరి తనము హైకోర్టు వారికి ఆశ్చర్యము కలిగించినదను విషయము బహిరంగ సత్యము. తమ తీర్పును వ్రాయునపుడు ఈ విషయమును ప్రత్యేకముగ పేరొ ్నరు కూడా. జస్టిస్‌ ఆమ్చ్రరామ్‌ అంటారు.
‘‘ఆపీళ్లు చేసుకొనిన వారందరిలో నాథూరాం గోడ్సే మాత్రము ఇండియన్‌ పినల్‌ కోడ్‌ 302వ సెక్షన్‌ కింద జరిగిన నేర నిర్ణయమును వ్యతిరేకించక పోవుటయే గాక ఆ నేరమునకు అతనిపై విధింపబడిన మరణంపై కూడా అపీలు చేసుకోలేదు. తన అపీలును న్యాయస్థానములో ఈమ వాదనలను, తనపై రుజువు కాబడినట్లుగా నిర్ణయింపబడిన ఇతర నేరారోపణలకు మాత్రమే పరిమితము చేసుకొనినాడు. ఆయన తన ఆపీలును, ప్రసిద్ధి చెందిన ఏ న్యాయవాదికైనా ఘనత చేకుర్చూ విధముగ వాస్తవములను క్రొడీకరించి సాక్ష్యము చూపుచు అందరి మన్ననల పొందినట్టి నైపుణ్యముతో, స్వయముగా వాదించుకొనినారు.
నాథూరామ్‌ యొక్క ఆలోచనా శక్తిని గూర్చి న్యాయాధిపతి వ్రాసినది.
‘‘ఆయన మెట్రిక్యులేషన్‌లో కృతార్థుడు కాకపోయినా చాలా అధికముగా పఠించియున్నారు. తన ఆపీలును వాదించుకొనుటలో ఇంగ్లీషు భాషలో మంచి ప్రావీణ్యమును, స్పష్టమైన ఆలోచనా విధానమలో చెప్పునకోదగినంత సామర్ధ్యమును ప్రదర్శించినారు’’.
వాదనలు జరుగునప్పుడు నాథూరామ్‌ తాను 1948 జనవరి 20వ తేదదీన బిర్లా భవనము వద్ద లేనని వాదించినారు. న్యాయాధిపతి ఈ వాదనను నిరాకరించినారు. ఇట్లా నిరాకరించేట్టేప్పుడు నాథూరామ్‌కు గల దృఢమైన సంకల్పశక్తిని గూర్చి తాము వెలిబుచ్చిన అభిప్రాయములను ఉదాహరించినారు. శ్రీ అచ్చ్రురామ్‌ అంటారు.
‘‘ఐదు వారమలుకు పైగా ఈ అపీళ్లను విను సందర్భములోను, ఇంకా ప్రత్యుకముగా ఆయన తన వాదనలను తానే వినిపించుచుండిన ఎనిమిది తొమ్మిది రోజులలోను నాథూరామ్‌ను తగినంతగా గమనించినాము.
ఇంత మనోస్థైర్యము గల వ్యక్తి అట్టి (వెనుక నుండి నడుపవలెనను) భావమును తన మనస్సులోనికి రానిచ్చివుంటాడనుటను నేను ఊహించను గూడా వూహించలేను.
(రేపు నేరస్థుడు కాదు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles