
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల మండలం సర్పరాజ్ పూర్ గ్రామంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను కోరుట్ల సీఐ కె. లక్ష్మీనారాయణ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలు, సర్పంచ్ రాజ్‌కుమార్, గ్రామ యువతను ప్రత్యేకంగా అభినందించారు. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో వీలైనంత ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్ఐ ఎం. చిరంజీవి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.
