(బాలె అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
మెట్‌పల్లి పట్టణ స్వర్ణకార సంఘానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రఘుకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా స్వర్ణకార సంఘానికి కమిటీ హాలు నిర్మాణానికి సహకరించాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సంఘానికి చెందిన 156 గజాల ఖాళీ స్థలం ఇప్పటికే సిద్ధంగా ఉందని, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో మంజూరు చేయించాలని కోరారు. ముఖ్యంగా ఎంపీ నిధుల కోటా నుండి రూ.15 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేయాలని అభ్యర్థించారు.
అలాగే పట్టణంలో పలువురు పేద స్వర్ణకారులకు సొంత ఇళ్లు లేకపోవడం వల్ల శుభ–అశుభ కార్యక్రమాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డాక్టర్ రఘు దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన డాక్టర్ రఘు మాట్లాడుతూ, స్వర్ణకార సంఘం సమస్యలను ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ అధ్యక్షుడు వంగల మహేష్, ప్రధాన కార్యదర్శి తొగిటి విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు శ్రీపాద సతీష్, సహాయ కార్యదర్శి కలికోట లక్ష్మణ్, మెట్‌పల్లి బులియన్ సంఘాల అధ్యక్షులు తొగిటి రమేష్, బెజ్జారపు నవీన్, నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, బెజ్జారపు మురళి, కోటగిరి తిరుమల్, నాంపల్లి మారుతి, బెజ్జారపు భూమేశ్వర్, బెజ్జారపు రఘు, తునికి చిన్న అంజయ్య, బెజ్జారపు సురేష్, వంగల మహేందర్, దోనోజు వెంకటేష్, ఆకోజీ శ్రీధర్, వేములవాడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
(సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి, దేశభక్తి, దైవ భక్తి గలవారికి రిపోర్టర్లుగా స్వాగతం.) సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727
