(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం డాక్టర్ అనూప్ రావ్ స్వగృహంలో నిర్వహించిన బీజేపీ సమావేశంలో పార్టీకి భారీగా చేరికలు జరిగాయి. పట్టణంలోని 29వ వార్డుకు చెందిన అల్లాడి ప్రవీణ్, 28వ వార్డుకు చెందిన మచ్చ శేఖర్, 8వ వార్డుకు చెందిన తాళ్లపెల్లి శ్రీనివాస్, రేగుంట మహేంద్రతో పాటు వివిధ వార్డుల నుంచి సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎంపీ ధర్మపురి అరవింద్ కండువాలు కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోరుట్ల మున్సిపల్టినీ బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఇన్‌చార్జ్ శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షులు మోరాపెల్లి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు డా. రఘు, ఏలేటి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి, డా. అనూప్ రావు పాల్గొన్నారు.
అలాగే మాజీ కౌన్సిలర్లు ఇందూరి సత్యం, పెండం గణేష్, మాడవేణి నరేష్, కస్తూరి లక్ష్మీనారాయణ, గిన్నెల శ్రీకాంత్, సుదవేణి మహేష్, జక్కుల జగదీశ్వర్, ఉరుమాండ్ల చరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్, బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

