రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రేపు అనగా శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మూసి ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కాం ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. అయితే మూసి ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదని దానిని అడ్డం పెట్టుకొని తద్వారా కాంగ్రెస్ దోపిడీకి తాము తీవ్ర వ్యతిరేకమని ఆయన అన్నారు. ఉద్యోగులకు నెలనెలా సరియైన సమయంలో జీతాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం మూసి నది ప్రక్షాళన కోసం ఒక లక్ష యాభై కోట్లు ఎక్కడినుండి ఎలా తెస్తుందని ఆయన విమర్శించారు.
