తాను నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తుందని, ఇబ్బందులు పెడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్ పార్టీ లాగానే ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో ఇబ్బందిగా ఉందని ఆయన ప్రస్తావించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తాను వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై పార్టీ మార్గదర్శకం చేయాలని ఆయన ఖర్గేను కోరారు
