ఆంధ్రప్రదేశ్లో మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే నాయకుల రాజీనామాలతో ఇబ్బందులు పడుతున్న వైసిపికి వాసిరెడ్డి పద్మ తన రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న వాసిరెడ్డి పద్మ గత ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకుంది.
