కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్లో ఆందోళనలు ఉద్రితమై షేక్ హసీనా పదవి దిగటానికి కారణమైనటువంటి తరహాలోనే మళ్లీ బంగ్లాదేశ్లో నిరసనకారులు బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ నివాసాన్ని ముట్టడించినట్టు సమాచారం. ఆందోళన కారులు షాబుద్దీన్ ను పదవి నుండి వైదెలగాలని డిమాండ్ చేశారు. ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
