
తెలంగాణ సామ్నా బ్యూరో: ఈ ఫార్మా కార్ రేసులో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏసిబి ఫైల్ చేసిన కేసును కొట్టివేయాలని కేటిఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మంగళవారానికి(07.01.25)కు తీర్పును రిజర్వుచేసి ఈ రోజు కేటిఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. దీనితో ఏసిబికి మరియు ఈడీకి కేటిఆర్ ను విచారించడానికి మార్గం సులభమయ్యింది.
అయితే ఈ నేపథ్యంలో కేటిఆర్ ‘‘వాట్ నెక్స్ట్’ అనే ప్రశ్న చాలా మందిలో వస్తున్నది. కేటిఆర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెలతాడని చాలా మంది అంటున్న మాట. ఎలాగైనా ఏసిబి దూకుడును నిలువరించాలనే ప్రయత్నం కేటిఆర్ చేస్తాడని మరో వర్గం అంటుంది.
ఏసిబి తన ఇంటికి విచారణ పేరుమీద వచ్చి ఎవో కొన్ని బొగస్ ఫైళ్లు దొరికాయని డ్రామాలు చేసే అవకాశం ఆరోపణలు బారాస వర్గం చేస్తున్నది. అయితే ఇవేవి పట్టనట్లు ఏసిబి తన పని తాను చేసుకుపోతూ దూకుడును ప్రదర్శిస్తున్నది. మంగళవారం గ్రీస్ కో ఎనర్జీకి చెందిన కార్యాలయాలను తనఖీ చేయడానికి ఒక టీం మచిలీపట్నం వెళ్లినట్లు తెలుస్తున్నది.
ఓ వైపు బారాస ఇదంతా రేవంత్‌రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న పనిగా చెప్పుతున్నారు. తాము కేటిఆర్ పై కేసు విషయం చట్ట ప్రకారం గానే ఎదుర్కుంటామనే ధీమా చూపెడుతున్నారు.
కాని సుప్రీంకోర్టు కూడా కేటిఆర్ విచారణకు సహకరించాలనే చెబుతుందని చాలా మంది అంటున్న మాట. ఈ నేపథ్యంలో ఏసిబి జనవరి 9వ తేదీ తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా వున్నాయన్న చర్చ నడుస్తుంది. ఈలోగా కేటిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగినా అక్కడ ఆనుకున్నంత సానూకూలత లభ్యం కాకపోపచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
