
(నిన్నటి తరువాయి)
ఆప్టే, నాథూరామ్ గోడ్సెలు హిందూ మహా సభా పతాకం కింద 5 లేక 6 సంవత్సరములు కలిసి పనిచేసినారు. 1948 జనవరి 20 మరల జనవరి 30వ తేదీఆలలో డిల్లీలో నేరములు జరిగిన స్థలములోనే వుండినారు. ‘‘కుట్రకు మూల కారకుడైన మేధావి’’ గా నేరారోపకులు ఆప్టేను వర్ణించినారు. నాథురామ్ గోడ్సే, నారాయణ ఆప్టే తమ ప్రాణాల కన్న ముఖ్యముగా భావించిన జాతీయ ఆఖండత్వ లక్ష్యమునకై, తమ పెదవులపై ‘‘వందేమాతరం’’తోప, చేతిలో చేయి వేసుకొని భుజము భుజమ కలిపి మరణించివలసినట్లు విధివిధానమైనది.
ఆప్టే అందమైనవాడు. వివాహమైనది. ఒక కుమారుడు కూడా. ఈ బిడ్డ 12వ ఏట మరణించినడు. ఆదీ ఆప్టె ఉరితీయబడిన తరువాత.
విష్ణుకర్కారే అమమ్మద్‌నగర్ నివాస, భోజన వసతి గృహము వుండినది. అతను చుకుకైన రాజకీయ కార్యకర్త. బెంగాలీలోని నౌఖళి (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో వున్నది) హిందువుల వ్యధ స్థానముగా మారినప్పుడు, పది మంది గల యువక బృందముతో కర్కారే అక్కడికిపోయి అక్కడి హిందువులను సమాయత్తపరచి, తమ రక్షణలో ఎదురు దెబ్బ తీయు వైఖరిని అవలంభించు చున్నట్లు చేసినాడు. హిందూ మహాసభ పతాకము క్రింద లనేక శరణార్థి కేంద్రములను కూడా ఏర్పాటు చేసినాడు. ఇది 1946లో జరిగనది. ఇతను కూడా డిల్లీఓ నేరస్థలములో జనవరి 20 మరియు 30 తేదీలలో వుండినాడు.
కర్కారే కు వివాహమయినది. కాని సంతానము లేదు.
గన్ కాటన్ స్లాబ్ ప్రేల్చిన మదన్‌లాల్ ఒక శరణార్థి. సాముహిక హత్యలు, దోపిడిలు దహనాలను ఇతను స్వయముగా చూచినాడు. ప్రయాణిస్తున్న జనసమూహలు, మైళ్లకొలది పొడవు, లక్షల కొలది మానవులు కల్గినవి. తమ సొంత నివాస స్థానాల నుండి తరుమబడి ముక్క చెక్లఐన ఇండియా వైపుకు ప్రయాణం చేయడం చూచినాడు. మదన్‌లాల్ తాను చూచిన అనుభవించిన విషాదగాథను న్యాయస్థానములో ఇచ్చి తన వాంగ్మూలంలో వివరించినాడు.
అతను అప్పటికి అవివాహితుడు.
శంకర కిష్టయ్య ఐదవ నిందితుడు. ప్రభుత్వ సాక్షిగా మారిన దిగంబర బాడ్గె సేవకుడు. 1948 జనవరి 20వ తేదీన అతను డిల్లీలో నేరస్థలములో వుండినాడు.
(మిగితా రేపు)
