(తెలంగాణ సామ్నా డెస్క్, కోరుట్ల)
తెలంగాణ సామ్నా జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బాలే అజయ్ తల్లిగారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ మంగళవారం కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో ఉన్న బాలే అజయ్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించిన సురభి నవీన్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాలే అజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
