
(తెలంగాణ సామ్నా డిస్క్)
మావోయిస్టు పార్టీ కీలక నేతగా చెప్పబడుతున్న బర్సే దేవా తో పాటుగా మరికొందరు శుక్రవారం తెలంగాణ డిజిపి ఎదురుగా లొంగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
గత కొద్ది రోజుల క్రితం ఎన్కౌంటర్లో మరణించిన హిద్మా, దేవా ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారిగా చెబుతున్నారు. చాలా కాలంగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తూ వచ్చిన దేవాకు మావోయిస్టు మిలటరీ వ్యూహాలు ఆయుధాల సరఫరాలో కీలకపాత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది.
హిద్మా మరణం తర్వాత మావోయిస్టు మిలటరీ నెట్వర్క్ తీవ్రంగా దెబ్బతిందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దేవా తో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగుబాటలో ఉండడం అనేది చర్చనియాశంగా మారింది.
మావోయిస్టు పార్టీ కార్యక్రమాలు కుదేలైపోతున్న నేపథ్యం ఒకవైపు కీలక నేతల మరణం మరోవైపు తో పాటుగా మరికొందరు కీలక నేతలు లొంగుబాటలో పయనిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు లోగానే మావోయిస్టు ఉద్యమం నీరుగారి పోయే అవకాశాలు ఉన్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు
