త్వరలో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహా వికాస్ అఘా డి కూటమిలో సీట్ల పంపకం పూర్తి కావచ్చినట్టు తెలియ వచ్చింది. ఎన్సిపి శివసేన కాంగ్రెస్ తల 85 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. మిగిలిన 18 సీట్లలో ఇండియా కూటమికి కేటాయించ బోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై గురువారం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పటోలే తెలిపారు. ఈసారి కచ్చితంగా తమ మహా వికాస్ అఘాడి కూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
