జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒబులాపూర్ లో అన్నను హత్య చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన పల్లెపు సాయిలు ను అతని తమ్ముడు తల్వార్ తో నరికి హత్య చేశాడు,ఆస్తి పంపకాల విషయంలో పల్లెపు సాయిలు, పల్లెపు చంద్ ల మద్య గొడవ జరుగుతుంది, దీంతో పలుమార్లు పంచాయతీ నిర్వహించినా గొడవ సద్దుమనగలేదు,మల్లాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు అయింది.పాత కక్షలను మనసులో పెట్టుకున్న పాలెపు చంద్, ఆదివారం ఒబులాపూర్ శివారులోని గోదావరి వద్ద పాలేపు సాయిలు వ్యవసాయ పనులు చేస్తుండగా తల్వార్ తో కొట్టి హత్య చేసినట్టు,అదే గ్రామానికి చెందిన గొల్ల సోమయ్య,సాయిలు ఇంకో సోదరుడైన చిన్ని ముగ్గురు కలిసి హత్య చేశారు .మహారాష్ట్ర నుండి తల్వార్ తీసుకువచ్చి హత్య చేశారని,సంఘటన జరిగిన వెంటనె ముగ్గురు పరారీ కాగా వాళ్లను ఈ రోజు పట్టుకుని రెండు బైకులు,తల్వార్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.
