
తెలంగాణ సామ్న: ఎన్ని సార్లు చెప్పిన “పాడిOదే పాడరా పాసుపండ్ల రామదాసా” అన్నట్లు తయారయ్యింది కాంగ్రెస్ యావ్వారమని ప్రజలు అనుకునే పరిస్థితి కాంగ్రెస్ మహరాష్ట్ర ఎన్నికల విషయంలో తెచ్చుకుంటుంది. ఓటర్ల తొలగింపు, చేర్చడం సాధ్యం కాదని గతంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. బహుశ ఆ విషయం మరిచిపోయిన రాహుల్ గాంధీ తాజాగా మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింంగ్ జరిగిందని ఆరోపించడం తాజా చర్చకు తావిచ్చింది. 118 నియోజకవర్గంలో 72 లక్షల ఓట్లను జోడిOచారని అందులో 102 నియోజకవర్గాల్లో బాజాపా గెలించిందని ఆయన తాజాగా రిపిట్ చేసిన ఆరోపణ. లోక్‌సభ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విధంగా ఓటర్లను ఆయా నియోజకవర్గాల్లో జోడిరచారని రాహూల్ అన్నారు. రాహూల్ తాజగా చేసిన ఈ ఆరోపణ వివాదం కాకపోగా కేవలం రాజకీయ దురుద్ధేశ్య పూర్వకంగా చేసిన విమర్శగానే ప్రజలు భావిస్తుండడం విశేషం
