తెలంగాణ సామ్న బ్యూరో: చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్‌ఎంపివి భారత్‌లోకి వచ్చినట్లు సమాచారం అందుతోంది.
బెంగుళూర్‌లోని 8 నెలల ఓ చిన్నారికి హ్యూమన్ మెటాన్యుమో వైరస్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తున్నది. చిన్నారి అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చేరిన చిన్నారికి ల్యాబ్ టెస్ట్‌లు చేసిన అనంతరం హెచ్‌ఎంపివి అని నిర్దారించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కర్నాటక ప్రభుత్వం అధికారికంగా తెలపలేదు. విదేశాలకు ప్రయాణం చేయని ఓ ఎనిమిది నెలల చిన్నారికి హెచ్‌ఎంపివి నిర్దారణ జరిగిందని వార్తలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
