(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షుడిగా నేమూరి విజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నేమూరి విజయ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై. అనూప్‌రావు, జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, రుద్ర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధవేణి మహేష్, పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నేమూరి విజయ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి సుధవేణి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి మేకల గణేష్, పట్టణ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్, గడ్డం శేఖర్, చింతగింది గోపాల్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు దమ్మ సంతోష్‌రెడ్డి, బీజేవైఎం నాయకులు బొమ్మెన శ్రీకాంత్, పందిళ్ల లోకేష్, గుద్దేటి మనోజ్, వరుణ్ తేజ్, రాహుల్, బొమ్మెన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
