(బాలే అజయ్ – 9290277727, మెట్‌పల్లి)
బీజేపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ సూచించారు.
మెట్‌పల్లి పట్టణ మాజీ బీజేపీ అధ్యక్షుడు, 26వ వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన సురభి నవీన్ కుమార్ పట్టణ బీజేపీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, స్థానిక సమకాలీన రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పార్టీ నాయకులు, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యపై స్పందిస్తూ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం సురభి నవీన్ కుమార్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి పట్టణ కౌన్సిలర్లు బొడ్ల రమేష్, అరిసె వనజ-మురళి, అరిగెల అనూష-రాకేష్, బీజేపీ నాయకులు సుంకేటి విజయ్, బొడ్ల గౌతమ్, తాళ్లపెల్లి సతీష్, కొల్లేపు శ్రీనివాస్, గుజ్జె గంగాధర్, కాదాస్తు శ్రీనివాస్, పడిగేల శ్రీనివాస్, తోకల సత్యనారాయణ, ముక్క మధు, కట్కం రాము, కోరుట్ల పట్టణ మాజీ బీజేపీ అధ్యక్షులు చిరుమల్ల ధనుంజయ్, కౌడ రమేష్, సాడిగే మహేష్, గోపు ప్రశాంత్, వెంకట్‌రెడ్డి రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
