
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
బీడీ మహిళలు, వృద్ధులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కోరుట్ల పట్టణంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని ఆందోళనకు మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్నాలో మహిళలు వివిధ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీడీ మహిళలు, వృద్ధులకు పెన్షన్లు అందించాలని, అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని కోరారు. పెన్షన్లు, సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, బీడీ కార్మికులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
