(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
పట్టణంలోని మహదేవ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, సాయిబాబా మందిరం, అలాగే అర్బన్ కాలనీలోని దుర్గామాత దేవాలయం భక్తులతో సందడిగా మారాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని నాగదేవతకు పూజలు నిర్వహించి, పాలు, పసుపు, కుంకుమ తదితరాలతో ప్రత్యేక పూజలు చేశారు.
నాగుల చవితి సందర్భంగా కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు నాగదేవతను ప్రార్థించారు. ఆలయాల వద్ద భక్తుల రద్దీ నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


