(బాలే అజయ్ – 9290277727)
తెలంగాణ రాష్ట్ర వేలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు బుధవారం ఎన్నికైన సందర్భంగా, కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి నర్సింగరావు స్వగృహం “జువ్వాడి భవన్”లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె శాలువాతో సన్మానించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జువ్వాడి నర్సింగరావు నాయకత్వంలో వేలమ సంక్షేమానికి మరింత ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మెట్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్, శంకర్, జమున, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
