
(తెలంగాణ సామ్నా డెస్క్)
బలుచిస్తాన్ పాకిస్తాన్ కు పక్కలో బల్లెం లా పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
ప్రత్యేక దేశం కోసం బలుచిస్తాన్ గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధం తాజాగా సరికొత్త దిశగా ప్రయాణం చేస్తున్నది. తమ.ప్రాంత విముక్తి కోసం గతంలో బెలిచిస్తాం లిబరేషన్ ఆర్మీ మగవారితో మాత్రమే పాక్ సైనికులపై దాడి చేయడం లేదా ట్రైన్ ను అపహరించడం లాంటిది చేసింది.
దీనికి భిన్నంగా తాజాగా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో మహిళలు ఆత్మహత్య బాంబర్లుగా మారి పాక్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముచ్చేమటలు పట్టిస్తున్నారు.
అసిఫా మింగల్ అనే మహిళ ఆత్మహుతి బాంబుగా మారి పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడింది. ఈ దాడిలో 50 మంది చనిపోగా అందులో పాక్ సైనికులు 17 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరే కాకుండా ఫిదా బాలుజ్ అనే మహిళ కూడా పాక్ సైనికులపై యుద్ధం చేస్తూ ముందుకు కదిలింది. పాక్ సైనికులతో పోరాడుతూనే బలుచిస్తాన్ విముక్తి యొక్క అవసరాన్ని చెబుతూ ఆ తర్వాత సుమారు 12 గంటలకు ఆమే మరణించింది.
మహిళలు యుద్ధంలోకి రావడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కరీ అవుతుందన్న సమాచారం వస్తుంది. మొత్తానికి బలుచిస్తాన్ పాకిస్తాను కు కంటిమీద కునుకు లేకుండా తమ పోరాటాన్ని సాగిస్తుండడం ప్రపంచ దేశాల్ని ఆలోచింపచేస్తుంది అలాగే ఆశ్చర్యపరుస్తుంది.


dhanyavadh