బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాటుదారులను పూర్తిస్థాయిలో అడ్డుకున్నప్పుడే పశ్చిమబెంగాల్లో శాంతి స్థాపన జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తేనే చొరబాట్లు ఆగిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ అవినీతిపై విమర్శలు సంధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజల్ని కోరారు. భారత్ బంగ్లా సరిహద్దులోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగును ఆయన ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
