కూతురు జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? తన కూతురు కవిత జైల్లో ఉంటే నేను బాధపడకుండా ఉంటానా? ప్రస్తుతము తాను ఒక అగ్నిపర్వతంలా ఉన్నానని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బడబాగ్నిని తన గుండెల్లో దాచుకున్న అగ్నిపర్వతంలా తాను పైకి కనిపిస్తున్నానని చెప్పలేక చెప్పినట్టుగా అగ్నిపర్వతాన్ని ఉపమానంగా తీసుకున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అయితే కవితను కేవలం రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టారని కెసిఆర్ విమర్శించారు. రాజకీయంగా ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకువచ్చి పదవినిస్తే బాధ్యతలు ఇస్తే వారిప్పుడు పార్టీ వీడుతున్నారని ఆయన ఆవేద వ్యక్తం చేశారు. ఆరు నెలలో కాంగ్రెస్ యొక్క హనీమూన్ ముగిసిందని ఆయన అన్నారు. అయితే టిఆర్ఎస్ ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ సమావేశానికి ఐదుగురు గైరాజరైనట్టుగా తెలుస్తుంది.
