కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననలు పొందారు. అయితే ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు మటుకు ఈ బడ్జెట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ ఇది అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్ అని విమర్శించారు. ఇది బుజ్జగింపుల పర్వం నిండిన బడ్జెట్ అని అన్నారు. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మాని పోస్టులను కాపీ కొట్టారని తెలిపారు. ధనిక వర్గాలకు మేలు చేస్తూ సాధారణ ప్రజానిక సంక్షేమాన్ని విస్మరించారని ఆయన విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని దేవా చేశారు. కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలోనే ఏపీకి బీహార్ కు నిధుల వరద పారించారని ఆయన అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి ఎలాంటి మాట లేకపోవడం బీజేపీ యొక్క వివక్షకు నిదర్శనం అని విమర్శించారు. తెలంగాణలో బిజెపికి నూకలు చెల్లినాయని అన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలో దక్షిణాదిన ఉన్న సీఎంలను కలిసి తమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు
