(నిన్నటి తరువాయి)
- నేను, నావంటి భావములు కల్గిన హిందూ యువత, లోపల నుండి గాంధీజీ చర్యలు, బయటనుండి ముస్లింలీగు ఎత్తుగడలవల్ల కలుగు ఆపాయములను పరిహరించుటకు అనుసరించదలచిన పోరాట కార్యక్రమములకు మార్గరదర్శనము చేయకపోగా, కనీసం అవగాహనకు కూడా వీర సావర్కరు, మరియు ఇతర హిందుసభ వృద్ధ నాయకులు నమ్మదగిన వారు కాదని, బాధాకరముగా నా కండ్లు తెరపించిన అనేక సంఘటనలలో కోట్ట వచ్చేటట్టు కనబడే రెండు సంఘటనలను మాత్రము ఇచ్చట ఉదాహరిస్తాను. 1946లో లేక ఆ ప్రాంతములలో సుహర్‌వర్ది ప్రేరణ ప్రోత్సాహాలతో వసఖాళీలో హిందువులపై జరిగిన అత్యాచారములు మా నెత్తురు మరుగునట్లు చేసినవి. గాంధీజీ తన ప్రార్థనా సమావేశములలో కూడా ఆ సుహర్‌వర్దిని వెనకకేసుకొని వస్తూ అతనిని ‘షాహిద్ సాహెబ్’ త్యాగ పురుషుడు అని వర్ణించినపుడు మేము పొందిన అవమానము, అగ్రహములను వర్థించలేము. అదొకటే కాదు. డిల్లీకి వచ్చిన తరువాత, గాంధీజీ భంగీ కాలనీలోని హిందూ దేవాలయములో ప్రార్థనా సమావేశములు జరిపి, హిందూ భక్తుల అక్షేపణలను లెక్క చేయకుండా అచ్చట ఖురాన్‌లోని భాగములును పఠించవవెనని పట్టుబట్టినాదు. కాని అదే గాంధీ ఒక మశీదులో, ముస్లింల అక్షేపణ వచ్చినప్పుడు గీతను చదువుటకు సాహసించలేక పోయినాడు. అతడే ఆ పనిచేసి వుంటే ఎటువంటి తీవ్రమైన ప్రతీ చర్యలు ముస్లింలు చేబట్టి వుండేవారో అతనికి బాగా తెలుసును. కాని సాహసవంతులైన హిందువుల భావములను మాత్రము క్షేమముగా నిర్లక్ష్యముగా తన కాళ్ల క్రింద త్రొక్కగల్గినాడు. ఈ అపవాదును నమ్మకమును, అబద్దము చేసే హిందువు కూడా ఆత్మగౌరవమునకు భంగము కల్గినపుడు సహనము కోల్పోగలడని గాంధీజీ రుజువు చేయవలెనని నిశ్చయించుకొనినాను.
- ఆప్టె, నేను డిల్లీలో ఆయన సభల వద్ద వరుసగా ప్రద్శనలు జరిపి అటువంటి ప్రార్థనలు చేయుట ఆసాధ్యమగునట్ల చేయ నిర్ణయించుకొనినాము. ఆప్టె, గాంధీజీ, షహీద్ సుహర్ వర్దీల చర్యలను ఖండిరచుచు డిల్లీలో శరణార్థులతో కూడిన ఒక పెద్ద ఊరేగింపును లేవదీసి భంగీకాలనీలో జరుగుచుండిన ప్రార్థనా సమావేశములోనికి దూసుకుపోయినాడు. అందువెంట ప్రదర్శితమై బ్రహ్మండమైన వ్యతిరేకతను గమనించిన గాంధీజీ అతి తెలివిగా, ముందు కాపలాతో, కమ్ములతో రక్షింపబడిన తలుపుల వెనుక ఆశ్రమయు పొందినాడు. అప్పటికి ఆయనెపై బల ప్రయోగము చేయవలెననే ఆలోచన మాకు అణుమాత్రము కూడా కలుగలేదు.
37.ఈ ప్రదర్శనను గూర్చి పత్రికలలో చదివిన వీర సావర్కరు మా చర్యను అభినందించుటకు బదులు, ప్రదర్వన శాంతియుతముగ జరిగినప్పటికి, నన్ను పిలిపించి అరాచక విధానాలు అవలంభించినామని అతరంగికముగ నన్ను తప్పు పట్టినాడు. ఏ విధముగా అయితే కాంగ్రెసు వారు తమ అక్రమ చర్యలతో మీ సమావేశములను ఎన్నికల బూతులను భగ్నం చేసినప్పుడు వారిని ఖండిస్తారో, అదే విధంగా హిందు సంఘటనా వాదులు ఏమైనా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను జరిపినప్పుడు వాటిని కూడా నేను ఖండిరచవలసి యుంటుంది. ఘాంధీజీ తన ప్రార్థనా సమావేశములలో హిందూ వ్యతిరేక ప్రచారము చేసినట్లయితే, మీరు మీ పక్షాన పార్టీ సమావేశములు జరిపి ఆయన ప్రబోధాలను ఖండిరచండి, మనలో మనము అన్ని పక్షముల వారము ప్రచారములను చట్టబద్దమైన పద్దతులలో జరుపుకోవలసినదే’8 అని ఆయన నాతో అన్నారు.
(తరువాయి బాగం రేపు)
