(నిన్నటి తరువాయి)
- విజ్ఞాన ధని ప్రభుత్వ న్యాయవాది తన ప్రాథమిక ప్రసంగములో నన్ను వీరసావర్కరు చేతి పనిముట్టుగా వర్ణింపకయుండిన ఈ వాజ్ఞులములో పైన చెప్పిన దానినంతా వివరించి యుండెడి వాడనుకాను. ఆ కథనము నా స్వతంత్ర న్యాయ నిర్ణయశక్తికి, కార్యచరణశక్తికి బుద్ధి పూర్కవముగ జరిపిన అసమానముగా నేను భావించుచున్నాను. నాపై ఏవైన దురభిప్రాయములు కలిగి వుంటే అని తొలగిపోవుటకుగా పై సత్యములను చెప్పవలసి వచ్చినది. కావున నా మిగతా వాజ్ఞులమును కొనసాగించుటకు ముందు, కడపట గాంధీజీ పై, తుపాకి గుండ్లు కాల్చుటకు దారితీసిన నా కార్యకలాపలను గూర్చి వీకపావర్కరుకు ఎఱుక లేదని మరియొకసారి నొక్కి వక్కానించుచున్నాను. నా సమక్షములో ఆప్టెగాని, నేను స్వయముగా గాని బాడ్గెతో గాంధీ. నెహ్రు, సుహ్రవర్దీలను అంతమొందించమని వీరసావర్కరు మాకు ఆజ్ఞ ఇచ్చినానడని ప్రభుత్వ సాక్షిగా మారిన వానిచే చెప్పించిన అసత్యములు నిజములు కాకాపోవుటయేగాక పచ్చి అబద్ధములని చాటి చెప్పుచున్నాను. మేము ఎప్పుడైనా బాగ్గేను వీరసావర్కరు వద్దకు అటువంటి కుట్ర విషయంములో, తుది దర్శనము కొరకు తీసుకొని పోయినా మనుటయు, వీరసావర్కరు ఎప్పుడైనా ‘‘విజయము సాధించి తిరిగిరండి.. ‘‘యశోనిహోయా’’ అని చెప్పినాడనుగాని నిజము కాదు. నా సమక్షములో ఆప్టెగాని, నా అంతట నేను గాని గాంధీజీకి నూరు సంవత్సరములు నిండినవి, అందువలన మీరు విజయవంతులౌతారు. అని వీరసావర్కరు మాతో అన్నాడని బాగ్గెతో ఎప్పుడు చెప్పియుండలేదు. అటువంటి దీవెనలు కోరుటకు నేనేమి అంత మూధవిశ్వాసాలు గలవాడను గాను.
అటుమంటి జోస్యములు నమ్ము పల్లివాడను గాను.
(తరువాయి బాగం రేపు… రెండవభాగము)
గాంధీజీ రాజకీయాలు ఒక నిశిత పరిశీలన
