(నిన్నటి తరువాయి)
భారతదేశ విభజన వలన కలిగిన తీవ్ర వేదనకు, గాంధీజీ హత్య అనే విషాద సంఘటనకు గల నేపథ్యము సంక్షిప్తముగ ఇవ్వబడినది. ఈ రెండిరటిలో ఏ ఒక్కదానిని లికిత మూలకంగా వుంచడం గాని, జ్ఞాపకము చేసుకొనడం గాని నాకు ఏలాంటి సంతోషము కలిగించదు. కాని, భారత ర్రపజలు, ఇంకా ప్రపంచమంతా కూడా, ఏ కాలంలో ఐతే బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానము వలన, మత వర్గముల ఐక్యత అనే తప్పు విధానమువలన, భారతదేశం ముక్కలుగా చీల్చబడిరదో ఆ ముఖ్యమైన సంవత్సరముల చరిత్ర తెలుసుకోవలసి యున్నది. ఏ చర్య వల్లనైతే హిందూ ముస్లిం ఐక్యత చూరకపోగా ఐక్యతకు మూలాధారమే బద్ధలు కొట్టబడిరదో అట్టి చర్యకు మహాత్ముడు పాల్పడేటట్టు ద్రోమము జరిగినది. ఐదు కోట్ల భారతీయ ముస్లింలు మన దేశస్థులు కాకుండా పోయినారు. పశ్చిమ పాకిస్థానులోని అల్పసంఖ్యాకులైన హిందువులు అతి దారుణంగా సామూహికంగా హత్య చేయబడుట వలననైతేనేమీ, శతాబ్దాలుగా తాము జీవించిన స్థావరముల నుండి తొలగింపబడుటవలననేతేనేమి, వాస్తవంగా సర్వనాశనం చేయబడినారు.
అదే పద్దతి తూర్పు పాకిస్థాన్‌లో కూడపా తీవ్రముగ ఆచరణలో పెట్టబడుచున్నది. పదకొండు కోట్లమంది అందులో నలబై లక్షలకు తక్కువ కాకుండా ముస్లింలు కూడా వున్నారు. తమ గృహముల నుండి పెకిలించి వేయబడినారు. ఇటువంటి భయంకర ఫలితాలను చూపచిన తర్వాత కూడా, అదే బుజ్జగింపు విధానాన్ని కొనసాగిస్తూ వుంటే నా నెత్తురు మరిగిపోయినది. ఇక ఒక క్షణంకూడా అతని ఉనికిని సహించలేకపోయినాను. గాంధీజీకి వ్యతిరేకముగా నేను వ్యక్తిగతమైన కఠిన పదజాలమును ఉపయోగింపకోరుట లేదు. కాని అతని విధానాల, పద్దతుల పునాదలకు సహా నా తీవ్రమైన వ్యతిరేకతను, అక్షేపణను ఎంత మాత్రము దాచియుంచలేదు. నిజానికి బ్రిటిష్ వారు తమ ‘‘విభజించు పాలించు’’ విధానానికి అనుగుణంగా ఎల్లప్పుడు ఏమి చేయవలెనని కోరుకొనుచుండినారో దానినంతయు చేసి పెట్టుటలో గాంధీజీ కృతర్దుడైనాడు. భారతదేశమును విభజించుటలో ఆయన వారికి సహయము చేసినాడు. కాని వారి పాలన అంతమయిందనుట మాత్రము ఇంకా ఖాయము కాలేదు.
(ఇంకా వుంది)
