(నిన్నటి తరువాయి)
యుద్ధకాలంలో ప్రభుత్వమును సంకట పరిస్థితులలో పడవేయకుండా హిందూ ముస్లింలను విభిన్న ధోరణులలో వుంచగల్గినందుకు బ్రిటిష్ ప్రభుత్వం పాకిస్థాన్ భావాన్ని ఇష్టపడిరది. ముస్లింలేమో యుద్ధ ప్రయత్నాలకు ఆటంక పరచలేదు. కాంగ్రెస్ మాత్రం కొన్ని సమయాలలో వ్యతిరేకంగాను ప్రవర్తించింది. వీటికి భిన్నంగా హిందూ మహాసభ మాత్రము మన యువకులు మనజాతికి అత్యవసరమైనదిన్నీ, ఇంతవరకు బ్రిటిష్ వారు మనలకు దూరముగ ఉంచినది, అయిన మిలిటరీ శిక్షణ పొందుటకు సదవకాశముగ గ్రహించినది. యుద్ధ అవసరాలకై సైనిక, నావిక, విమాన దళాల తలుపులు మనకు తెరువబడినవి. హిందూసభ హిందువలను సైనికీకరణ చేయమని దేశస్థులను ప్రేరేపించినది. ఫలితం ఏమంటే ఐదు లక్షల హిందువులు సైనిక దళలలో తర్ఫీదు పొందినారు. ఇంకా ఆధునిక యుద్ధ విధానములలో యంత్రముల ప్రాముఖ్యమును కూడా తెలుసుకొనినారు. మహాసభ యొక్క దూరదృష్టి ఫలితాలను కాంగ్రెసు వారు అననుభవించుచున్నారు. ఎందువల్లనంటే అటువంటి దృక్ఫథముగల వ్యక్తులు లేకపోయి యుండినట్లయితే కాశ్మీరులో వుపయోగించుచున్న సైన్యాలు సంసిద్ధంగా వుండి వుండేవి కావు. 1942లో కాంగ్రెసు స్వాతంత్య్రము పేర క్విట్ ఇండియా ఉద్యమము ప్రారంభించినది. కాంగ్రెసువారు ప్రతి రాష్ట్రములోను హింసాత్మక దౌర్జన్యాలు కొనసాగించినారు. ఉత్తర బీహారు రాష్ట్రములో ఈ కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమకారులచేత తగులబ్టెబడకుండా ఒక్క రైలు స్టేషన్ కూడా మిగులలేదు. అయితే ఈ కాంగ్రెసు వారి వ్యతిరేకత ఉన్నప్పటికి, జర్మనులు 1945 ఏప్రిల్లోను, జపాన్ వారు 1945 అగస్టులోను ఓడిరపబడినారు.
అణుబాంబు జపానువారి పోరాటశక్తిని కూల్చివేసింది. కాంగ్రెస్ పక్షము వ్యతిరేకించినప్పటికి బ్రిటిష్ వారు జపానీయులు, జర్మనుటు, ఇరువురిపై విజయము సాధించినారు. నిజానికి తర్వాత కొన్ని సంవత్సరముల వరకు కాంగ్రెసు క్రీయాశీల పథమును ఎంత మూల్యమైనా చెల్లించి శాంతి ఏది ఏమైనా కాంగ్రెసు అధికారములోకి రావాలి అని వర్ణించడం సక్రమంగా ఉంటుంది. తమను అధికారములో వుంచిన బ్రిటిష్ వారితో రాజీపడి, దానికి బదులుగా జిన్నా దౌర్జన్య చర్యలకు లొంగిపోయి, మత ప్రాతిపదికగా దేశములో మూడవ భాగమును చీల్చి ఇన్ని దాని ఆచరణ క్రమములో ఇరవై లక్షల మునవులను అంతము చేసింది కాంగ్రెసు. ఇంత చేసి, పండిత్ నెహ్రు ఇపుడు కాంగ్రెసు మతాతీత రాజ్యాన్ని మాత్రమే బలపరుస్తుందని పదే పదే చెప్పుకొనుచున్నాడు. అయితే ఎవరైనా గత సంవత్సరమే మత వర్గ సిద్ధాంతాల ప్రాతిపదికపై ఒక రాజ్యం ఏర్పడడానికి తాను అంగీకరించినాడని విజ్ఞప్తి చేసిన యెడల, వారిని ఉక్రోషంతో నిందించుచున్నారు ఆయనగారు. మతాతీత రాజ్యానకి బద్దుడనని చేసే ఆర్భాటకమైన వాచాలత్వమును చూస్తుంటే ఇది తప్పకుండా ‘‘గౌరవనీయురాలు అతిగా (తప్పును) నిరాకరిస్తున్నది’’. (వీవ ూaసవ జూతీశ్ీవర్ం ్శీశీ ఎబషష్ట్ర అనే సూక్తి మాదిరిదే అని అనిపిస్తుంది.
కాంగ్రెస్ను సమావేశపు గదిలోనికి పిలిచేముందు కాంగ్రెస్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి తిలోదకాలు వదలవలసి వచ్చింది. జపానుతో యుద్ధంలో తన సహకారాన్ని హమీ ఇవ్వవలసి వచ్చినది. ఇంకా వేవెల్ ప్రభువును భారత ప్రభుత్వానికి అధిపతిగా అంగీకరించవలసి వచ్చినది.
(ఇంకా వుంది)
