
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, బొమ్మల మేడిపల్లి గ్రామంలోని భాస్కర హాస్పిటల్ ముందు ఉన్న మూల మలుపు వద్ద ఆదివారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి నుండి జేబీఎస్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కోరుట్ల వైపుకు వెళ్తున్న టవేరా వాహనం ఎదురు ఎదురుగా ఢీ కొన్నాయి. ప్రమాద సమయంలో టవేరా వాహనంలో చిన్నారులతో సహా సుమారు 11 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. గానుగపూర్లోని ప్రసిద్ధ దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బాధితులు కోరుట్ల వాసులుగా సుంకె రాజేష్, రజిత, హనీ, వరుకుల రమేష్, మమత, పాప త్రినైనా, వారితో పాటు సురేష్, వనిత, పాప సౌమ్య, డ్రైవర్ రాజు ఠాకూర్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక మరియు విచారణ చర్యలు చేపట్టారు.
టవేరాలో ఉన్న ప్రయాణికుల్లో 7 గురికి గాయాలు కాగా, వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 గురి పరిస్థితి విషమంగా ఉన్నందున జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

