జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం శ్రీ జై భారత్ పబ్లికేషన్స్ రిజిస్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. కోరుట్ల ఇంచార్జ్ ఆర్డిఓ ఇన్ఛార్జ్ ఎన్. శ్రీనివాస్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. మెట్పల్లి డి.ఎస్.పి కె ఉమామహేశ్వరరావు తెలంగాణ సామ్నా వెబ్ పేజీని ప్రారంభోత్సవం చేయగా, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య అనిల్ శ్రీ హైందవి భక్తి ఛానల్ ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా మీడియా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతము సోషల్ మీడియా వల్ల ప్రజల సమస్యల్ని ప్రభుత్వం గానీ అధికారులు గానీ తెలుసుకుంటున్నారని వారు సమర్థవంతంగా నిజాయితీగా పనిచేసే ప్రజల మన్నలను పొందాలని చెప్పారు. మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా కూడా తన వంతు సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి మీడియా మరింత గొప్పగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ మాట్లాడుతూ శ్రీ హైందవ భక్తి ఛానల్ మహిళలకు భక్తి విషయంలో తగిన సూచనలు ఇచ్చి వారికి సహాయకారిగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. భక్తి భావంలో ఉన్న అపోహలను శ్రీ హైందవి భక్తి ఛానల్ తొలగించి మహిళలకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
