(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ కార్యక్రమంలో భాగంగా హిందూ బంధువులు, సనాతన ధర్మ ప్రచారకులు ఎమ్మార్వో కార్యాలయాన్ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో గారికి సమర్పించిన వినతి పత్రాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి గార్లకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోరుపాక రమేష్, కళాల సాయి చందు, బీఆర్‌ఎస్ నాయకులు టేకుల నరేష్‌తో పాటు హిందూ బంధువులు కొండబత్తిని అమర్ నాథ్, వడ్లకొండ శ్రీనివాస్, గట్ల ప్రకాశ్, యాంసాని ప్రసాద్, కంఠం శ్రీనివాస్, బర్కాం సతీష్, కునారపు గణేష్, గోనె వినయ్, కోటగిరి సంపత్, బొమ్మెన ప్రదీప్, గండ్ర మహీదర్, చింతకింది రాజు, జగదీష్, క్యాతం మహేష్, నాంపల్లి ప్రసాద్, అనిల్, పేట అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
