(బాలే అజయ్ – 9290277727)
కార్మికుల దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల మరియు మెట్పల్లి పట్టణాల్లోని వివిధ వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ తన స్వంత నిధులతో లేబర్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కార్మికులు సమాజానికి బలమైన వెన్నెముకలని, వారి శ్రమతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్మికులు సంఘటితంగా యూనియన్ల రూపంలో ఏర్పడి, ఐక్యంగా నిలబడితే తమ హక్కులను సులభంగా సాధించుకోవచ్చని సూచించారు.
అలాగే, కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. బ్యాంకు ఎల్.డి.ఎమ్ రామ్ కుమార్తో కలిసి కార్మికులకు చిన్నపాటి వ్యాపారాలపై అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు.
స్వయం ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాల పొందడం, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే విధానాలపై కార్మికులకు వివరించారు. ఆర్థికంగా ఎదగడానికి ఈ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
