జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలము వేంపల్లి వెంకట్రావుపేట లోని గోదావరి నదిలో ఒక యువకుడు మునిగి గల్లంతయ్యాడు. రాయికల్ మండలం లోని అయోధ్య గ్రామానికి చెందిన పాకాల శ్రీ వర్ధన్ అనే యువకుడు మేనల్లుడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం వేంపల్లి వెంకట్రావుపేటకు వచ్చాడు. ఈ సందర్భంలో గోదావరిలో స్నానానికి దిగిన శ్రీ వర్ధన్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు.
