(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 35 అంశాలను ప్రతిపాదించగా, అందులో 34 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.
సమావేశంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికికాలువల శుభ్రతపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. వార్డుల్లో మురికికాలువలను శుభ్రం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.
దీనిపై చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో మురికికాలువల శుభ్రత పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈఈ, మేనేజర్, జేఏఓతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

