(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయి రామనది తీరాన గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ కార్యనిర్వాహకులు, శ్రీరామ సేవకులు, హనుమాన్ దీక్షాదారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది భక్తులు హాజరై శ్రీరాముని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కళ్యాణ మహోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయగా, హనుమాన్ దీక్ష స్వాములు, సేవకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
