కేరళలోని వాయనాడ్ లో చోటు చేసుకున్న ప్రకృతి విలయానికి మరణించిన వారి సంఖ్య గంటకు పెరుగుతూనే ఉంది. కడపటి వార్తలు అందేసరికి మృతుల సంఖ్య 165 చేరుకున్నట్టుగా తెలుస్తున్నది. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, సైన్యం కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయంతో సంబంధిత అధికారులతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించినట్టుగా తెలుస్తుంది. అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపినట్టుగా సమాచారం.
