మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన నేపథ్యంలో కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం గెలుపు సంబరాలను నిర్వహించారు. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్టాల్లో విజయ డంకా మోగించిన సందర్బంగా మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు స్వీట్లు పంపిణి చేసి టపాసులు పేల్చి సంబరాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షుడు మల్యాల మారుతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు దేశం మొత్తం కాషాయమయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు వారు పాదాభివందనాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతీ తో పాటుగా జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవి,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,గాందరి శ్రీనివాస్, పిడుగు ప్రతాప్ రెడ్డి, ఆరే శివ,రాజాం,ప్రసాద్, భూమయ్య,కిషోర్,రాము నాయక్,రాజేందర్,సత్యం, గంగారెడ్డి,జెలందర్ పాల్గొన్నారు.
