తెలంగాణ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నిరూపిస్తే తన పదవికి ఈ క్షణమే రాజీనామా చేస్తానని బారాస నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలను ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము తమవిగా చెప్పుకుంటూ గొప్పలు పోతుందన్నట్టుగా విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజల్ని సభని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు
