(తెలంగాణ సామ్నా, పిట్ట రాజేష్)
కోరుట్ల పట్టణ 17 వార్డు అరఫాత్ పుర కాగాజీ పుర అంగన్వాడీ సెంటర్ 2 లో ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు, మున్సిపల్ చైర్మన్ తిరుమల గంగాధర్ వసంత, 17 వార్డు కౌన్సిలర్ సోగ్రబి అక్బర్, మండల అధ్యక్షులు కొంతం రాజం విచ్చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పాఠశాల యూనిఫాంలు పంపిణీ చేయడం జరిగింది .ఇట్టి కార్యక్రమమనికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన మేడం అంబల్ల రాజమణి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు , పిల్లల తల్లులు కూడా పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
