
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఎన్నికల సందడి మొదలైంది. సంఘ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా శుక్రవారం బచ్చు శ్రీనివాస్ తన బంధువులు, మిత్రులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి శక్కరి వెంకటేశ్వర్లు, చౌడారపు శ్రీనివాస్‌లకు సమర్పించారు.
ఈ సందర్భంగా బచ్చు శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి అమ్మవారికి సేవ చేయడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మానుక రవీందర్, మైలారావు అంజయ్య, పొద్దుటూరి జలంధర్, నీలి మధు, చిద్రాల వినోద్, భూపతి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
