28.2 C
Hyderabad
Friday, September 18, 2026
No menu items!

ఆన్‌లైన్‌ (డిజిటల్‌) పెమేంట్‌ ఎందుకో ఇపుడు అందరికి ఆర్థం అవుతుంది

తెలంగాణ సామ్న బ్యూరో: ఆన్‌లైన్‌ చెల్లింపులు దేశానికి ఎందుకు అవసరమో తెలియజేసే సంఘటన ఒకటి శనివారం జరిగింది. డిజిటల్‌ ద్వారా వ్యాపార కొనుగోళ్లు, చెల్లింపులు భారతీయ వినియోగదారులు ఎక్కువగా చేస్తుండడం పరోక్షంగా దేశానికి సంపదను జమ చేయడం లాంటిదే అనే ఓ సంఘటన ద్వారా తెలిసింది. తాజాగా ఓ బండితో పానీపూరి వ్యాపారం నిర్వహించుకునే ఓ చిరు(?) వ్యాపారి 2024వ సంవత్సరంలో 40 లక్షల రుపాయల ఆదాయం వచ్చినట్లుగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వున్న విషయాన్ని జియస్‌టి శాఖ వారు గమనించి ఆశ్చరపోయారు. ఈ మొత్తం కూడా డిజిటల్‌ చెల్లింపులే కావడంతో వ్యవహరం బట్టబయలయ్యింది.

తద్వారా పరోక్షంగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా దేశానికి జరిగే మేలు కూడా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసింది. చాలామంది ఐటియన్లుగా చెప్పుకొని దర్జాగా తిరిగేవారు కూడా ఆ స్థాయిలో సంపాదించడం లేదని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో సంపాదించిన సదరు వ్యాపారి ఆదాయ పన్ను,GST కట్టవలసిందేనని నెటిజన్లు అంటుండడం కొసమెరుపు.
ప్రజలు తాము కొనుగోళ్లు చేస్తున్న సమయంలో నగదు కాకుండా డిజిటల్‌ పేమేంట్‌ చేయడం ద్వారా ప్రతి వ్యాపారస్థుని ఆదాయ వివరాలు ఆదాయపన్ను శాఖకు లేదా జిఎస్‌టి శాఖకు తెలిసే అవకాశం వుంటుంది. తద్వారా పన్ను వసూలు చేసే అవకాశం వుంటుంది. అది దేశసంపదగా మారుతుంది అనే విషయాన్ని ప్రజలు గమనించాలని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. నగదు చెల్లింపు వల్ల వ్యాపారస్థుని ఆదాయం, వ్యాపార లావాదేవీలు తెలిసే అవకాశాలు చాలా తక్కువగా వుంటుంది. అలాగే ఆ డబ్బు ఎదో ఒక సమయంలో నల్లధనంగా మారే అవకాశాలు వుంటాయని చెబుతున్నారు. అందుకే డిజిటల్‌ చెల్లింపులను ప్రొత్సాహించాలని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles