తెలంగాణ సామ్న బ్యూరో: మేడిగడ్డ బ్యారేజికి పగులు రాలేదని, రేవంత్‌రెడ్డి బుర్రకు పగులు(పర్రె) పడిరదని బారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. శనివారం సిరిసిల్లలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. రాహుల్‌గాంధీని మేడిగడ్డకు తీసుకెళ్లి పగుళ్లు చూపెట్టారని, కాని చూపెట్టాల్సింది కాని పర్రె పడిరది రేవంత్‌రెడ్డి బుర్రకు అని కేటిఆర్ విమర్శించారు. 5.3 స్థాయిలో భూకంపం వచ్చినా మేడిగడ్డకు ఏం కాలేదని కేటిఆర్ తెలిపారు. తాను రేవంత్‌రెడ్డి చిట్టా రాసుకుంటున్నానరి వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తానని ఆయన ఫైర్ అయ్యాడు.
