జన్వాడ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించిన కేసులో కేటీఆర్ సమీప బంధువు రాజు పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సోమవారం రోజు విచారణకు హాజరు కావాలంటూ రాయదుర్గంలోని విల్లాకు పోలీసులు నోటీసులు అంటించిన విషయం తెలిసినదే. ఈ క్రమంలో తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటానికి ప్రయత్నిస్తున్నారని అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
