తెలంగాణ సామ్నా బ్యూరో: స్నేహితురాలని నమ్మినందుకు ఓ యువతికి మరో యువతి మద్యం తాగించి తన స్నేహితునితో అత్యాచారం చేయించమే కాకుండా సదరు ఘోరాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయించడానికి ఓ యువతి కారణం అయ్యిందన్న విషయం సంచలనం అయ్యింది. ఈ సంఘటన హుజుర్నగర్లో జరిగింది. స్థానికి ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం… హుజుర్‌నగర్‌కు చెందిన ప్రమోద్‌కుమార్‌కు ఓ యువతితో పరిచయం వుంది. ఆ యువతితో ఆమె స్నేహితురాలు కూడా ప్రమొద్కుమార్కు పరిచయం ఎర్పడిరది. ఈ క్రమంలో మార్చి 7వ తేదీన మధ్యాహ్నం బాధిత యువతితో మాట్లాడేది వుందని ఓ లాడ్జీకి తీసుకెళ్ళాడు. అక్కడ మద్యం తాగించి, ఆమె మత్తులోకి జారుకోగానే ఆమెపై లైంగిక అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాధిత యువతి నగ్న ఫోటోలు తీసుకున్నాడు.
ఈ సంఘటన తరువాత ఈ నెల 18న మధ్యాహ్నం ప్రమోద్‌కుమార్, అతని పాత స్నేహితురాలుతో పాటుగా మరో స్నేహితుడు హరీష్‌లు కలిసి బాధిత యువతిని కారులో తీసుకొని కోదాడ రోడ్డువైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రమోద్‌కుమార్ బాధిత యువతిని హరీష్‌తో లైంగికంగా కలవాలని ముగ్గురు ఒత్తిడి తీసుకువచ్చారు. బాధిత యువతి అందుకు ఒప్పుకోకపోవడంతో తాము గతంలో తీసిన నగ్న ఫోటోలు బయటపెడతామని బెదిరించారు. అయినా కూడా ఒప్పుకోకపోవడంతో బాధిత యువతిని శారీరకంగా హింసించారు. వారు పెట్టిన హింసను భరించలేక పారిపోయింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు కారులో వున్న ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారు. ఆ తరువాత బాధిత యువతి ఇంటికి చేరుకొని కుటుంబసభ్యులకు విషయం అంతా తెలిపింది. ఆ తరువాత స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు స్థానిక ఎస్ఐ ముత్తయ్య ప్రమోద్, హరీష్ వారి స్నేహితురాలు పై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి సంబంధం వున్నవారు అనే ప్రచారం జరుగుతున్నది.
