(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, చిన్న మెట్పల్లి గ్రామానికి చెందిన సిరిపురం రాంప్రసాద్ (47) ప్రమాదవశాత్తు సైకిల్ పై నుండి పడి గాయపడ్డాడు. గాయపడ్డ రాంప్రసాద్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాంప్రసాద్ గత మూడు సంవత్సరాలుగా పక్షవాతం (పెరాలసిస్) వ్యాధితో బాధపడుతూ కుడిచేయి పనిచేయని పరిస్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం మెరుగుపడుతుందనే సూచనతో సుమారు నెల రోజుల క్రితం సైకిల్ కొనుగోలు చేసి గ్రామంలో ప్రతిరోజూ సైకిల్ తొక్కుతున్నాడు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 8వ తేదీన మధ్యాహ్నం చిన్న మెట్పల్లి గ్రామంలో సైకిల్ అదుపుతప్పి కిందపడడంతో అతనికి తలకు తీవ్ర అంతర్గత గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.
అయితే చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు. మృతుని మేనమామ అనుమల్ల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
