24.3 C
Hyderabad
Monday, September 14, 2026
No menu items!

శ్రీ మహాలక్ష్మమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి నర్సింగరావు, మైలారపు లింబాద్రి

(బాలే అజయ్ – 9290277727, మెట్‌పల్లి)

ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలతో పాటు మెట్‌పల్లి పట్టణ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రైసుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles