26.2 C
Hyderabad
Monday, September 14, 2026
No menu items!

మెట్‌పల్లిలో ఖాదీ కార్మికుల సేవలకు గుర్తింపు

(బాలే అజయ్ – 9290277727, మెట్‌పల్లి)

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్‌పల్లి పట్టణంలోని ఖాదీ ప్రతిష్ఠాన్‌లో విధులు నిర్వహిస్తున్న ఖాదీ కార్మికులు మచ్చ అశోక్, రాజేందర్‌లను ఘనంగా సన్మానించారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మెల శంకర్ శాలువాలు కప్పి వారిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంప్రదాయ వస్త్ర సంస్కృతిని చేనేత కార్మికులు తమ కృషితో సజీవంగా నిలబెడుతున్నారని కొనియాడారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని పేర్కొంటూ, ఈ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత ప్రోత్సాహం, సంక్షేమ చర్యలు చేపట్టాలని కోరారు.

చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కార్మికుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బొమ్మెల శివ, చిన్నయ్య, రమేష్, ఖాదీ ప్రతిష్ఠాన్ ఉద్యోగులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles